ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడండి

ABN , First Publish Date - 2020-09-25T17:05:36+05:30 IST

ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు బ్యాంకు ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ స్థలాన్ని కాపాడాలని మాజీ ఎమ్మెల్యే చింత

ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడండి

మంత్రి తలసానిని కలసిన చింతల, స్థానికులు

ఖైరతాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు బ్యాంకు ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ స్థలాన్ని కాపాడాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు చింతల నాయకత్వంలో బ్రైట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను గురువారం కలిసి సమస్యను వివరించారు.


పాఠశాల స్థలానికి దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ స్థలాన్ని బ్యాంకర్లు తనఖా పెట్టుకొని రుణం ఇవ్వడంపై అనుమానాలున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని.. కొత్త పాఠశాల నిర్మించాలని, అవసరమైతే తమ ఫౌండేషన్‌ ద్వారా భవనం నిర్మించి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చింతల తెలిపారు. ఈ విషయమై స్పందించిన మంత్రి... స్థలం ప్రభుత్వానికి చెందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు ప్రతినిధులు తెలిపారు.Updated Date - 2020-09-25T17:05:36+05:30 IST