అధిక ఫీజులపై ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-29T16:28:52+05:30 IST

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సీతమ్మధార

అధిక ఫీజులపై ఆగ్రహం

సీతమ్మధార(విశాఖపట్నం), సెప్టెంబరు 28: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సీతమ్మధార నక్కవానిపాలెంలో ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులకు మద్దతుగా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్‌కుమార్‌, సిరాజ్‌ఖాన్‌, నరేంద్ర సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు.


వైసీపీ నాయకుడు కేకే రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు కూడా ఆందోళనకారులకు మద్దతుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ఘటనా స్థలికి వచ్చిన డీఈవో బి.లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలకు నోటీసులు పంపామని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Updated Date - 2020-09-29T16:28:52+05:30 IST