ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. ఇంజనీర్లకు రివార్డులు

ABN , First Publish Date - 2020-05-05T23:10:22+05:30 IST

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో గత ఐదేళ్లుగా విశిష్ట సేవలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్తలకు ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐర్) రివార్డులను ఇవ్వాలనుకుంటోంది.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. ఇంజనీర్లకు రివార్డులు

సైన్స్‌ అండ్ టెక్నాలజీలో పరిశోధనలకు రివార్డులు..

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో గత ఐదేళ్లుగా విశిష్ట సేవలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్తలకు ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐర్) రివార్డులను ఇవ్వాలనుకుంటోంది. ‘శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ-2020’ పేరుతో ఈ రివార్డును అందజేయబోతోంది.. భారతీయులై ఉండి 45 ఏళ్ల వయసులోపు వారై ఉంటే ఈ రివార్డులకు అర్హులు. ఎంపికైన పరిశోధకులకు ఐదు లక్షల రూపాయలను అందిస్తారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో 22-05-2020లోపు దరఖాస్తు చేయాలి. 


వెబ్‌సైట్: www.b4s.in/aj/SSB5




మహిళా ఇంజనీర్లకు అవార్డులు:

భారత్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న మహిళలందరికీ శుభవార్త.. గూర్గాన్‌లోని ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (ఐఎన్‌ఏఈ) ఓ ప్రత్యేకమైన అవార్డను ప్రకటించింది.  ‘విమెన్ ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్-2020’ని పేరుతో మహిళా ఇంజనీర్లను సత్కరించాలనుకుంటోంది. ఇంజనీరింగ్ విభాగాల్లో కొన్నేళ్లుగా విశేష కృషి చేసిన మహిళలు ఈ అవార్డులకు అర్హులు. 40 నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ అవార్డులకై దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.2 లక్షల రివార్డును అందజేస్తారు. దరఖాస్తుకు ఆఖరు తేదీ:15-05-2020


వెబ్‌సైట్: www.b4s.in/aj/INW3




ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్స్

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బడ్డీ4స్టడీ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. పదో తరగతి ఉత్తీర్ణత సాదించి.. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. కనీసం 50శాతం మార్కులను పదో తరగతిలో సాధించి ఉండాలి. ఆయా విద్యార్థుల కుటుంబాల సంపాదన ఏడాదికి 6లక్షలలోపు ఉండాలి. ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తునకు ఆఖరు తేదీ: 31-05-2020.. 


వెబ్‌సైట్: www.b4s.in/aj/EWS1



Updated Date - 2020-05-05T23:10:22+05:30 IST