గ్రామ సచివాలయాల్లో బదిలీల్లేవ్‌!

ABN , First Publish Date - 2020-11-13T16:18:20+05:30 IST

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రొబేషనరీకాలం

గ్రామ సచివాలయాల్లో బదిలీల్లేవ్‌!

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రొబేషనరీకాలం పూర్తయ్యేదాకా బదిలీలు చేయకూడదని, డెప్యూటేషన్లకూ అనుమతివ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌లో ఈ అంశంపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగీ గ్రామ, వార్డు సచివాలయాల నుంచే సేవలు అందించాలన్నారు. వారి ప్రొబేషనరీ పీరియడ్‌ను చాలా సీరియ్‌సగా తీసుకోవాలని, ఈ సమయంలో ఎలాంటి బదిలీలు, డెప్యూటేషన్లకు అనుమతి ఇవ్వరాదని సూచించారు. 

Updated Date - 2020-11-13T16:18:20+05:30 IST