2 నెలలకు రెండున్నర రోజులే సీఎల్.. టీచర్ల సెలవులపై ఆంక్షలు

ABN , First Publish Date - 2020-11-21T18:55:53+05:30 IST

ఉపాధ్యాయుల సెలవులపై పాఠశాల విద్యాశాఖ పలు ఆంక్షలు విధించింది. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నిబంధనల్లో మా ర్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం సవరణ ఉత్తర్వులు(మెమో 151) జారీ చేశారు. నవంబరు-డిసెంబరు నెలల్లో కేవలం రెండున్నర రో జుల క్యాజువల్‌ లీవు(సీఎల్‌)లను మాత్రమే వినియోగించుకోవాలని షరతు పెట్టారు.

2 నెలలకు రెండున్నర రోజులే సీఎల్.. టీచర్ల సెలవులపై ఆంక్షలు

కొవిడ్‌ సోకితే 14 రోజుల మెడికల్‌ లీవ్‌

టీచర్ల సెలవులపై ఆంక్షలు

కారణం చెప్పకుండానే మెమో వెనక్కి తీసుకోవాలని సంఘాల డిమాండ్‌


అమరావతి/కలికిరి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సెలవులపై పాఠశాల విద్యాశాఖ పలు ఆంక్షలు విధించింది. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నిబంధనల్లో మా ర్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం సవరణ ఉత్తర్వులు(మెమో 151) జారీ చేశారు. నవంబరు-డిసెంబరు నెలల్లో కేవలం రెండున్నర రో జుల క్యాజువల్‌ లీవు(సీఎల్‌)లను మాత్రమే వినియోగించుకోవాలని షరతు పెట్టారు. ఉపాధ్యాయులకు ఏడాదికి 15 సీ ఎల్స్‌ ఉంటాయి. నిబంధనల ప్రకారం ఏడాదిలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు వినియోగించుకునే అవకాశం ఉం టుంది. కానీ, ఇప్పుడు నవంబరు-డిసెంబరు నెలలకు సంబంధించి దామాషాలో రెండున్నర రోజుల సీఎల్స్‌ను మా త్రమే వాడుకోవాలని పేర్కొన్నారు.


ఉపాధ్యాయులకు ఏడాదికి 7 స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌లు ఉండగా, వాటిల్లో నవంబరు-డిసెంబరు నెలల్లో ఒక్క రోజు మాత్రమే వాడుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే, ఉపాధ్యాయులు కోవిడ్‌ బారిన పడితే 14 రోజులు మెడికల్‌ లీవ్‌లో వెళ్లాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయుల స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ల వినియోగంలోనూ కోత పెట్టారు. ఏడాదికి వీరికి 5 స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌లు ఉండగా, ఒక్క లీవ్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు. అయితే, సెలవుల కుదింపుపై మెమోలో కారణాలు చూపకపోవడం గమనార్హం. కాగా, మెమో 151పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సెలవుల నిబంధనలను కాలరాస్తున్నారని సంఘాల నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. మెమోను వెనక్కి తీసుకోవాలని టీఎన్‌యూఎస్‌ ప్రెసిడెంట్‌ మన్నం శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.ఎస్‌.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మెమో అసంబద్ధమైందని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.వెంకటేశ్వరరావు విమర్శించారు.

Updated Date - 2020-11-21T18:55:53+05:30 IST