కేంద్రం వల్లే విద్యా రంగం కుదేలు: పువ్వాడ
ABN , First Publish Date - 2020-09-14T17:34:57+05:30 IST
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల వల్లే విద్యా రంగం కుదేలైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. ఖమ్మంలో గ్రేస్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 300 మంది ప్రైవేటు టీచర్లకు
ఖమ్మం టౌన్, సెప్టెంబరు 13: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల వల్లే విద్యా రంగం కుదేలైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. ఖమ్మంలో గ్రేస్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 300 మంది ప్రైవేటు టీచర్లకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కొవిడ్-19 వల్ల విద్యారంగం ఇంకా నిలదొక్కుకోలేదన్నారు. చిన్న ఉద్యోగాలు, తక్కువ వేతనంతో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యారంగం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలతో పాటు అందరిపై ఉందన్నారు. పువ్వాడ ఫౌండేషన్ తరఫున తాము కూడా ప్రైవేటు టీచర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.