దళిత ప్రొఫెసర్‌కు వేధింపులు

ABN , First Publish Date - 2020-09-05T16:54:43+05:30 IST

ఆంధ్రా వర్సిటీలో హెచ్‌ఆర్‌ఎం విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జాన్‌... పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దళిత ప్రొఫెసర్‌కు వేధింపులు

పని చేసుకుంటుండగానే సిబ్బంది తాళాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా వర్సిటీలో హెచ్‌ఆర్‌ఎం విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జాన్‌... పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కాలర్స్‌ థీసెస్‌, ఇతర పరిశోధన పనుల్లో భాగంగా రోజూ రాత్రి 11 గంటల వరకు విద్యార్థులతో కలిసి ఆయన విభాగంలోనే ఉంటారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా సెక్యూరిటీ సిబ్బంది వచ్చి తాము లోపల ఉండగానే తాళాలు వేస్తున్నారని, తాను దళితుడైనందునే ఇలా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  


Updated Date - 2020-09-05T16:54:43+05:30 IST