అధిక ఫీజుల వసూలుపై హెచ్చార్సీ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-16T18:01:51+05:30 IST

ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేయడంపై మానవ హక్కుల కమిషన్‌

అధిక ఫీజుల వసూలుపై హెచ్చార్సీ ఆగ్రహం

సినీనటుడు శివబాలాజీ ఫిర్యాదుకు స్పందన 

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేయడంపై మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ మణికొండలోని ఓ బడి అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ సినీ నటుడు శివబాలాజీ సోమవారం హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన హెచ్చార్సీ.. మంగళవారం రంగారెడ్డి జిల్లా విద్యాధికారి (డీఈవో) కి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా తమకు నివేదిక అందజేయాలని నిర్దేశించింది

Updated Date - 2020-09-16T18:01:51+05:30 IST