పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-06-18T17:17:54+05:30 IST

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌-2020) దరఖాస్తు సమర్పణ గడువును జూలై 21 వరకు పొడిగించారు. ఇప్పటికే ఒకసారి జూన్‌ 15 వరకు

పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌-2020) దరఖాస్తు సమర్పణ గడువును జూలై 21 వరకు పొడిగించారు. ఇప్పటికే ఒకసారి జూన్‌ 15 వరకు పొడిగించిన రాష్ట్ర సాంకేతిక విద్య-శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాలిసెట్‌ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. మార్చి 16 నుంచే దరఖాస్తును ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు దారులు మీసేవ/పేమెంట్‌ గేట్‌వే/నెట్‌ బ్యాంకింగ్‌/ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ద్వారా రూ.400 ఫీజు చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 41 సెంటర్లలో పాలిసెట్‌ జరుగుతుంది. పరీక్ష రెండు గంటల పాటు 120 మార్కులకు నిర్వహిస్తారు. 120 ఆబ్జెక్టివ్‌ టైపు ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్‌, కెమిస్ర్టీల్లో 30 ప్రశ్నల చొప్పున, గణితంలో 60 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించే తేదీని ఇంకా ప్రకటించలేదు.


Updated Date - 2020-06-18T17:17:54+05:30 IST