22 నుంచి ఓయూ పరీక్షలు యథాతథం

ABN , First Publish Date - 2020-10-19T15:58:23+05:30 IST

ఉస్మానియా వర్సిటీ పరిధిలోని పీజీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, వర్షాల కారణంగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను మాత్రమే వాయిదా వేశామ

22 నుంచి ఓయూ పరీక్షలు యథాతథం

ఉప్పల్‌, అక్టోబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా వర్సిటీ పరిధిలోని పీజీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, వర్షాల కారణంగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను మాత్రమే వాయిదా వేశామని ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. మొత్తం పరీక్షలు వాయిదా పడ్డట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని చెప్పారు. 22 నుంచి జరగాల్సిన పరీక్షలు యఽథాతథంగా జరుగుతాయన్నారు. కాగా, ఓయూ పరిధిలో సెప్టెంబరులో జరిగిన ఇంజనీరింగ్‌(బీఈ), బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ ఫలితాలు విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, జేఎన్టీయూహెచ్‌ పరిధిలో 19, 20 తేదీల్లో జరగాల్సిన యూజీ, పీజీ  పరీక్షలను వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆ వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 


Updated Date - 2020-10-19T15:58:23+05:30 IST