పాఠశాలలు ప్రారంభించాలి.. సంఘాల ధర్నా

ABN , First Publish Date - 2020-12-29T16:00:05+05:30 IST

రాష్ట్రంలో పాఠశాలలు, హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని, బాలల హక్కులు కాపాడాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం, పాఠశాల యాజమాన్యాల కమిటీ

పాఠశాలలు ప్రారంభించాలి.. సంఘాల ధర్నా

పంజాగుట్ట, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలలు, హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని, బాలల హక్కులు కాపాడాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం, పాఠశాల యాజమాన్యాల కమిటీ వేదిక, ఆల్‌ ఇండియా పేరెంట్స్‌ అసోసియేషన్లు డిమాండ్‌ చేశాయి. లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు ఆయా సంఘాల ప్రతినిధులు  సోమవారం ధర్నా నిర్వహించారు. బడులను ప్రారంభించాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-12-29T16:00:05+05:30 IST