చేను ఒ(బ)డిలో చదువు

ABN , First Publish Date - 2020-09-05T17:37:34+05:30 IST

మారుమూల పల్లెల్లో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు అందకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు విద్యార్థులు అవస్థ పడుతున్నారు. పలు గ్రామాల్లో సిగ్నల్‌ వచ్చే చోటుకు వెళ్లి

చేను ఒ(బ)డిలో చదువు

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కోసం మంచెపైకి

ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు అవస్థ

నిర్మల్‌ కలెక్టర్‌కు ట్వీట్‌ చేసిన విద్యార్థిని


ఖానాపూర్‌ రూరల్‌, సెప్టెంబరు 4: మారుమూల పల్లెల్లో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు అందకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు విద్యార్థులు అవస్థ పడుతున్నారు. పలు గ్రామాల్లో సిగ్నల్‌ వచ్చే చోటుకు వెళ్లి చదువుకుంటున్నారు. నిర్మల్‌ జిల్లాలో ఓ విద్యార్థిని ఏకంగా గ్రామానికి దూరంగా ఉన్న తమ పంట చేనులో మంచెపైకి ఎక్కి క్లాసులు వింటోంది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం రాజూర గ్రామానికి చెందిన సఫా జరీన.. నిర్మల్‌లోని మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేక ఇబ్బంది పడుతోంది. గ్రామ శివారులోని మొక్కజొన్న చేనులో సిగ్నల్‌ దొరకడంతో అక్కడ మంచెపైకి ఎక్కి తరగతులు వింటోంది. ఈ విషయాన్ని ఆమె నిర్మల్‌ కలెక్టర్‌కు ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. కాగా, విద్యార్థినికి తోడుగా తండ్రి కూడా చేనుకు వెళుతున్నాడు.

Updated Date - 2020-09-05T17:37:34+05:30 IST