బీఎస్సీ ఆన్‌లైన్ డిగ్రీకి 8154 మంది ఎంపిక
ABN , First Publish Date - 2020-12-10T16:23:18+05:30 IST
ప్రపంచంలోనే తొలి ఆన్‌లైన్ డిగ్రీని ప్రారంభించిన ఐఐటీ మద్రాస్... బీఎస్సీ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ కోర్సుల్లో

అర్హత సాధించిన 79 సంవత్సరాల వృద్ధుడు
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే తొలి ఆన్‌లైన్ డిగ్రీని ప్రారంభించిన ఐఐటీ మద్రాస్... బీఎస్సీ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ కోర్సుల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది. మొదటి క్వాలిఫయర్ రౌండ్‌కి దేశవ్యాప్తంగా 30,276 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబరు 22న నిర్వహించిన చివరి విడత పరీక్షలో 8,154 మంది అర్హత సాధించారు. వీరిలో విదేశాల్లోని భారతీయ విద్యార్థులు 40 మంది ఉన్నారు. ఎంపికైన వారిలో తెలంగాణ నుంచి 448, ఏపీ నుంచి 337 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ అర్హత పరీక్షకు ఎలాంటి వయోపరిమితి లేకపోవడంతో 50 ఏళ్లు పైబడినవారు కూడా దరఖాస్తు చేసుకోగా, 60 మంది అర్హత సాధించారని, వీరిలో 79 సంవత్సరాల వృద్ధుడు కూడా ఉన్నారని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి తెలిపారు.