పీజీ మెడికల్ కాంపిటెంట్ సీట్లకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-07-19T22:26:40+05:30 IST
పీజీ నీట్ కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీ

నీట్ కటాఫ్ స్కోర్ తగ్గినందున మరో అవకాశం
హైదరాబాద్, జులై 18 (ఆంధ్రజ్యోతి): పీజీ నీట్ కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలతో పాటు హైదరాబాద్ నిమ్స్ కళాశాలలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పీజీ వైద్య సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నీట్ పీజీ అర్హత కటాఫ్ స్కోరును కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు జూలై 19, 20 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. పీజీ వైద్య ప్రవేశాలకు జనరల్ కేటగిరిలో 275 (30 శాతం); ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 230(20 శాతం); దివ్యాంగులు(ఓసీ)కు 252(25 శాతం) కటాఫ్ మార్కులను తగ్గించారు.