కొలువులోకి 9,300 మంది కొత్త కానిస్టేబుళ్లు

ABN , First Publish Date - 2020-10-07T16:16:32+05:30 IST

శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సేవలందించేందుకు సిద్ధమయ్యారు. వివిధ విభాగాల్లో మొత్తం 9,300 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులు శిక్షణ పొందారు. టీఎ్‌సపీఏలో బుధవారం జరిగే పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు అదనపు డీజీపీ స్వాతిలక్రా హాజరై

కొలువులోకి 9,300 మంది కొత్త కానిస్టేబుళ్లు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సేవలందించేందుకు సిద్ధమయ్యారు. వివిధ విభాగాల్లో మొత్తం 9,300 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులు శిక్షణ పొందారు. టీఎ్‌సపీఏలో బుధవారం జరిగే పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు అదనపు డీజీపీ స్వాతిలక్రా హాజరై గౌరవ వందనం స్వీకరిస్తారు. వరంగల్‌ సీటీసీ, సంగారెడ్డితోపాటు మరో రెండు జిల్లాల్లో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించాలని అనుకున్నప్పటికీ సీఎం కేసీఆర్‌తో పోలీస్‌ అధికారుల సమావేశం కారణంగా వాయిదా వేశారు. ఈ నెల 9 వరకు అన్ని శిక్షణా కేంద్రాల్లో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లు పూర్తి చేయనున్నారు.


కొవిడ్‌ నిబంధనల కారణంగా పరేడ్‌కు సందర్శకును అనుమతించడం లేదు. 18న కొత్త కానిస్టేబుళ్లకు పోస్టింగ్‌ ఇస్తారు. ఈ సారి శిక్షణలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా కేవలం 300లోపు అభ్యర్థులు ఫుట్‌ బ్యాక్‌ అయ్యారు. వీరికి మరో 2 నెలలు అదనంగా శిక్షణ ఇస్తారు. కాగా ఎస్సై, ఏఎస్సైలకు 23న పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించనున్నారు.

Read more