నీట్‌ స్టేట్‌ ర్యాంకుల జాబితా విడుదల

ABN , First Publish Date - 2020-10-31T16:12:46+05:30 IST

ఎంబీబీఎస్‌ సీట్ల కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇటీవలే నీట్‌ ఫలితాలు విడుద లవగా, స్టేట్‌ ర్యాంకుల జాబితా కాళోజీ హెల్త్‌ వర్సిటీకి శుక్రవారం చేరింది. దీంతో రాష్ట్ర స్థాయిలో

నీట్‌ స్టేట్‌ ర్యాంకుల జాబితా విడుదల

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ సీట్ల కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇటీవలే నీట్‌ ఫలితాలు విడుద లవగా, స్టేట్‌ ర్యాంకుల జాబితా కాళోజీ హెల్త్‌ వర్సిటీకి శుక్రవారం చేరింది.  దీంతో రాష్ట్ర స్థాయిలో మొదటి 50 ర్యాంకులు సాధించిన వారి వివరాలను వర్సిటీ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సొంతం చేసుకున్న తుమ్మల స్నిఖిత స్టేట్‌ టాపర్‌గా నిలువగా, జాతీయ స్థాయిలో 715వ ర్యాంకు సాధించిన విద్యార్థికి  రాష్ట్ర స్థాయిలో 50వ ర్యాంక్‌ వచ్చింది. మొత్తం 22 మంది అమ్మా యిలు, 28 మంది అబ్బాయిలు టాప్‌ ర్యాంకులు పొందారు. అయితే ఈ ర్యాంకులు తాత్కాలికమేనని, మళ్లీ ఇవి మారే అవకాశం ఉందని హెల్త్‌ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కాగా, ఈసారి రాష్ట్రం నుంచి 50,392 మంది నీట్‌ రాశారు. వీరిలో 28,093 మంది అర్హత సాధించారు. వీరందరి మార్కులు, ర్యాంకులు, కేటగిరీ వంటి వివరా లు అందడంతో కన్వీనర్‌ కోటాలో మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేేసందుకు హెల్త్‌ వర్సిటీ  అధికారులు కసరత్తు మొదలుపె ట్టారు.  నవంబరు ఒకటి లేదా రెండో తేదీన షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు తెలిపాయి.


అయితే ధ్రువపత్రాల పరిశీలన భౌతికంగా ఉండదు, పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కౌన్సెలింగ్‌,  సీట్ల కేటాయింపును పూర్తి చేయాలని వర్సిటీ భావిస్తోంది. ఏటా ఆగస్టు నాటికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. ఈసారి కరోనా వల్ల నీట్‌ను ఆలస్యంగా నిర్వహించారు. దీంతో డిసెంబరు వరకు కౌన్సెలింగ్‌ను పూర్తి చేేసందుకు అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య విద్య కళాశాలల్లోని 15ు సీట్లను నేషనల్‌ కోటాలో భర్తీ చేస్తారు.   ప్రస్తుతం నేషనల్‌ కోటాకు తొలి విడత కౌన్సెలింగ్‌ జరుగుతోంది. ఈ కోటాలో సీట్ల కేటాయింపు పూర్తయిన తరవాతే స్టేట్‌ కన్వీనర్‌ కోటాలో సీట్లను భర్తీ చేస్తారు. జాతీయ కోటాకు ఇచ్చిన 15 శాతం సీట్లు పోగా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లోని అన్ని సీట్లనూ రాష్ట్ర స్థాయి ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను పాటించాల్సి ఉంటుంది.


నకిలీ ఏజెంట్లు.. వెబ్‌ సైట్లతో జాగ్రత్త: కేంద్రం

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నకిలీ ఏజెంట్లు, వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని దేశంలోని వైద్య- దంత కళాశాలలు, విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అటువంటి వాటికి సంబంధించిన ఏదైనా సమాచారం అందితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ మేరకు డైర్టెకర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు అత్యవసర సూచనలను శుక్రవారం జారీ చేసింది.  


Read more