ఇక 5+3+3+4

ABN , First Publish Date - 2020-09-16T16:42:01+05:30 IST

జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో ప్రతిపాదించిన 5+, 3+, 3+, 4 విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం

ఇక 5+3+3+4

జాతీయ విద్యావిధానానికి ఓకే

వచ్చే ఏడాది నుంచి అమలుకు నిర్ణయం

దీనికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు..

విద్యారంగంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి

స్కూళ్లు, కాలేజీల్లో ప్రమాణాలు తప్పనిసరి..

విధివిధానాలతో ఎస్‌వోపీ యాప్‌

విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి మేరకే బదిలీలు..

ఎన్‌ఈపీపై సమీక్షలో సీఎం జగన్‌

వచ్చే ఏడాది నుంచి 5+3+3+4


అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో ప్రతిపాదించిన 5+, 3+, 3+, 4 విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది. దీనికి తగిన విధంగా పాఠ్యపుస్తకాలను ముద్రించడంతో పాటు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించనుంది. 1, 2 తరగతులకు ముందే సంసిద్ధతా తరగతిని అభ్యసిస్తే వారి పునాది గట్టిగా ఉంటుందని, ఈ మేరకు తగిన ప్రణాళికను రూపొందించాలని సంకల్పించింది. జాతీయ విద్యా విధానంపై మంగళవారం సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యాలయాలు, కళాశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అవి కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయా? లేదా? అనేది చూడాలని సీఎం ఆదేశించారు. ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలను తక్షణమే మూసేయాలని, అవి తిరిగి ప్రమాణాలు సాధించిన తర్వాతే అనుమతించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగానే బదిలీలు చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-09-16T16:42:01+05:30 IST