‘మెడికల్ సీట్ల’పై విచారణ జరపాలి: దాసోజు
ABN , First Publish Date - 2020-12-29T15:57:34+05:30 IST
రాష్ట్రంలోని వైద్య, విద్య కళాశాలల్లో అక్రమంగా ఏపీ విద్యార్థులకు సీట్లు కేయించారని, ఈ అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైద్య, విద్య కళాశాలల్లో అక్రమంగా ఏపీ విద్యార్థులకు సీట్లు కేయించారని, ఈ అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. సీట్ల కేటాయింపులో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరిగిందని, అన్-రిజర్వ్డ్ కోటాలో అనర్హులైన ఏపీ వారికి సీట్లు కేటాయించారని ఆరోపించారు. కాళోజీ హెల్త్ వర్సిటీ వైస్‌చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి నిబంధనలను ఉల్లంఘించి స్థానికేతర విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు. తన ప్రైవేట్ కన్సల్టెన్సీ సూచనలకు అనుగుణంగా ఒక్క గాంధీలోనే 8 మంది ఏపీ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చేశారని వివరించారు.