వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు పూర్తి: కాళోజీ వర్సిటీ
ABN , First Publish Date - 2020-12-07T16:13:54+05:30 IST
కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి అయింది. ఈనెల 10వ తేదీలోగా అభ్యర్థులు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని కాళోజీ నారాయణరావు

హైదరాబాద్/హన్మకొండ అర్బన్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి అయింది. ఈనెల 10వ తేదీలోగా అభ్యర్థులు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో కోరింది. విద్యార్థులకు సీట్ల కేటాయింపు సమాచారాన్ని ఇప్పటికే ఎస్‌ఎంఎస్ ద్వారా చేరవేసింది. అలాట్‌మెంట్ వివరాలకు అభ్యర్థులు అడ్మిషన్ వెబ్‌సైట్ లో లాగిన్ అయి చూడవచ్చని కోరింది.