10 వరకు ‘మనూ’ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు

ABN , First Publish Date - 2020-05-30T16:49:56+05:30 IST

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును జూన్‌ 10 వరకు విధించినట్లు అధికారులు ఓ ప్రకటనలో

10 వరకు ‘మనూ’ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు

హైదరాబాద్‌ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును జూన్‌ 10 వరకు విధించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రధాన వర్సిటీతో పాటు దేశంలోని అనుబంధ కాలేజీల్లో ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్‌, పీహెచ్‌డీ, డీఈడీ, బీఈడీ కోర్సులతో పాటు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులను అందిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - 2020-05-30T16:49:56+05:30 IST