25లోగా ‘మెయిన్స్‌’ పరీక్ష తేదీల ప్రకటన

ABN , First Publish Date - 2020-06-04T18:08:50+05:30 IST

కొవిడ్‌-19 కారణంగా వాయిదా పడిన ‘మెయిన్స్‌’ పరీక్షల తేదీలను ఈ నెల 25వ తేదీలోగా ప్రకటించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు మాత్రం యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమనరీ పరీక్ష

25లోగా ‘మెయిన్స్‌’ పరీక్ష తేదీల ప్రకటన

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పూర్తయిన వెంటనే గ్రూప్‌-1 మెయిన్స్‌: ఏపీపీఎస్సీ

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 కారణంగా వాయిదా పడిన ‘మెయిన్స్‌’ పరీక్షల తేదీలను ఈ నెల 25వ తేదీలోగా ప్రకటించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు మాత్రం యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమనరీ పరీక్ష పూర్తయిన వెంటనే జరగనున్నాయి. బుఽధవారం విజయవాడలో సమావేశమైన ఏపీపీఎస్సీ కమిషన్‌ వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు, ఎలా నిర్వహించాలనే అంశాలపై చర్చించింది. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల భౌతిక తనిఖీ అవసరం లేదని, థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో గదిలో 50 శాతం అభ్యర్థులే పరీక్ష రాసేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ మాత్రం హాజరు కాలేదు.


ప్రాథమిక కీలపై 2,066 అభ్యంతరాలు..

మార్చిలో నిర్వహించిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌, ఎఫ్‌ఆర్‌వో, డీఏవో రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు సంబంధించి విడుదల చేసిన ప్రాథమిక కీలపై అభ్యంతరాలు వచ్చాయి. పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ ప్రాతమిక కీపై 2,066 అభ్యంతరాలు రాగా.. అందులో 689 ఒకే రకమైనవి ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌వో కీపై 305 అభ్యంతరాలు రాగా.. 114 ఒకే రకమైనవి ఉన్నాయి. డీఏవో కీపై 428 అభ్యంతరాలు రాగా.. 80 ఒకే రకమైనవి ఉన్నాయి. ఈమేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటన ఇచ్చారు.

Updated Date - 2020-06-04T18:08:50+05:30 IST