రేపు లాసెట్ రివైజ్డ్ ‘కీ’
ABN , First Publish Date - 2020-10-07T16:01:11+05:30 IST
లాసెట్-2020లో మూడేళ్ల కోర్సుకు సంబంధించి విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’లో పొరపాటు జరిగిందని లాసెట్-2020 కన్వీనర్ జ్యోతి విజయకుమార్ మంగళవారం

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): లాసెట్-2020లో మూడేళ్ల కోర్సుకు సంబంధించి విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’లో పొరపాటు జరిగిందని లాసెట్-2020 కన్వీనర్ జ్యోతి విజయకుమార్ మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన తప్పులకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి గురువారం రివైజ్డ్ ‘కీ’ విడుదల చేయనున్నట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు రెండు రోజుల గడువు ఇస్తామన్నారు. కాగా, ఈ పరీక్షలో లీగల్ ఆప్టిట్యూడ్ విభాగంలో 60 ప్రశ్నలకుగాను 40కి పైగా ప్రశ్నలకు సమాధానాలు తప్పులతో ఇచ్చిన విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించింది.