లాసెట్‌లో 76శాతం ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2020-11-07T16:13:44+05:30 IST

రాష్ట్రంలోని అన్ని లా కాలేజీల్లో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు ఉద్దేశించిన లాసెట్‌, పీజీఎల్‌సెట్

లాసెట్‌లో 76శాతం ఉత్తీర్ణత

హైదరాబాదీ స్నేహశ్రీకి మొదటి ర్యాంకు 

ట్రాన్స్‌జెండర్‌కు 190వ ర్యాంకు 


హైదరాబాద్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని లా కాలేజీల్లో డిగ్రీ, పీజీ  ప్రవేశాలకు ఉద్దేశించిన లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2020 ఫలితాలు శుక్రవారం విడులయ్యాయి.  ఈ మేరకు  తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆచార్య లింబాద్రి, ఆచార్య వెంకటరమణ, లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య జి.బి.రెడ్డి ఫలితాలను ప్రకటించారు. మూడేళ్ల లా కోర్సులో 15,398 మంది హాజరు కాగా 12,103 (78.60ు) మంది, ఐదేళ్ల లా కోర్సులో  3973 మంది హాజరు కాగా 2477 (62.35ు) మంది ఉత్తీర్ణత సాధించారు.


రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు కోసం 2188 మంది హాజరవ్వగా 1992 (91.04ు) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 30,262 మంది దరఖాస్తు చేసుకోగా 21,559 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 16,572 (76.87ు) మంది ఉత్తీర్ణత సాధించినట్లు పాపిరెడ్డి తెలిపారు.   ఈసారి ఇంటర్‌ సెకండియర్‌లో గైర్హాజరై ఉత్తీర్ణత సాఽధించిన విద్యార్థులు ఐదేళ్ల లాసెట్‌లో అర్హత సాఽధించి ఉంటే కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చని పాపిరెడ్డి తెలిపారు.


ఉస్మానియా న్యాయ కళాశాలలో ఈ ఏడాది కొత్తగా ఎల్‌ఎల్‌ఎం(క్రిమినాలజి జస్టిస్‌ సిస్టం),ఎల్‌ఎల్‌ఎం  (హ్యూమన్‌ రైట్స్‌ లాస్‌) అనే రెండు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామన్నారు. కాగా, ఈ ఏడాది ఐదేళ్ల  ఎల్‌ఎల్‌బీ కోసం ఘట్‌కేసర్‌లో ఎస్సీ బాలికల రెసిడెన్షియల్‌ న్యాయ కళాశాలను ప్రారంభించనున్నట్లు లాసెట్‌ కన్వీనర్‌  జి.బి.రెడ్డి తెలిపారు. రెసిడెన్షియల్‌ విధానంలో న్యాయ కళాశాలను నెలకొల్పడం దేశంలో ఇదే తొలిసారన్నారు.


తొలిసారి ట్రాన్స్‌జెండర్‌.. 

రెండేళ్ల లా కోర్సులో ప్రవేశానికి తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌ అర్హత సాధించారు. నాన్‌ లోకల్‌ కేటగిరీలో హాజరై 77 మార్కులతో రాష్ట్రస్థాయిలో 190వ ర్యాంకు సాధించారు.  ఈసారి మొత్తం ఐదుగురు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరు పరీక్షకు హాజరయ్యారని, వారిలో ఒక్కరు మాత్రమే అర్హత సాధించారని కన్వీనర్‌ తెలిపారు.


మూడేళ్ల లా కోర్సులో.. 

ర్యాంక్‌       పేరు  జిల్లా  

1 స్నేహశ్రీ హైదరాబాద్‌  

2 కే.సిద్ధార్థ కరీంనగర్‌ 

3 సురేష్‌  ఖమ్మం 


ఐదేళ్ల లా కోర్సులో..

 1 శ్రీనివాసకృష్ణ కరీంనగర్‌ 

 2  అరుణ్‌ మానుకోట 

 3  మహేష్‌  సూర్యపేట 


ఎల్‌ఎల్‌ఎంలో...

 1 ప్రవల్లిక  సిరిసిల్ల 

 2 రాజేష్‌  కరీంనగర్‌ 

 3 జి.అర్చన  హైదరాబాద్‌ 


Updated Date - 2020-11-07T16:13:44+05:30 IST