జూన్‌ 14న ‘ఎల్‌శాట్‌’ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-05-09T19:21:30+05:30 IST

‘లా స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌’ (ఎల్‌శాట్‌)-ఇండియా 2020 ప్రవేశ పరీక్షను జూన్‌ 14న నిర్వహించనున్నట్లు ‘లా స్కూల్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌’ (ఎల్‌శాక్‌) ప్రకటించింది.

జూన్‌ 14న ‘ఎల్‌శాట్‌’ ప్రవేశ పరీక్ష

న్యూఢిల్లీ, మే 8: ‘లా స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌’ (ఎల్‌శాట్‌)-ఇండియా 2020 ప్రవేశ పరీక్షను జూన్‌ 14న నిర్వహించనున్నట్లు ‘లా స్కూల్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌’ (ఎల్‌శాక్‌) ప్రకటించింది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ.. 2009 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రతి ఏటా రాత పూర్వకంగానే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడు ఆన్‌లైన్లో నిర్వహించాలని నిర్ణయించింది. అభ్యర్థులు.. తమ ఇంటి నుంచి గానీ, లేదా తమకు అనుకూలమైన ఇతర ప్రదేశం నుంచిగానీ పరీక్ష రాయవచ్చని ‘ఎల్‌శాక్‌’ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోనే రిమోట్‌ ద్వారా కృత్రిమ మేధస్సు పర్యవేక్షణలో జరిగే మొట్టమొదటి ఆన్‌లైన్‌ ‘లా’ప్రవేశ పరీక్షగా నిలవనుంది.

Updated Date - 2020-05-09T19:21:30+05:30 IST