లాక్‌డౌన్ పిరియడ్‌లో ఈ కోర్సులపై దృష్టిపెట్టండి.. ఐటీ నిపుణులు

ABN , First Publish Date - 2020-04-08T22:09:09+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు.

లాక్‌డౌన్ పిరియడ్‌లో ఈ కోర్సులపై దృష్టిపెట్టండి.. ఐటీ నిపుణులు

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతకు ఈ సమయం కీలకంగా మారింది. అనుకోకుండా చేతికొచ్చిన ఈ సమయాన్ని సాంకేతికంగా ఎదిగేందుకు సద్వినియోగపరుచుకోమంటున్నారు ఐటీ నిపుణులు. సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని సూచిస్తున్నారు. కాలేజి విద్యార్థులు, ఐటీ నిపుణులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. స్క్రిప్టింగ్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ జావా స్క్రిప్టింగ్, పైథాన్ వంటి కోర్సెస్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టమంటున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉండి,  కంప్యూటర్ లేదా మొబైల్‌లో అందరూ ఉచితంగా నేర్చుకోగలరంటూ కొన్ని లింక్స్ ఇచ్చారు. వాటిని అనుసరిస్తే.. ఉచిత తరగతులు కళ్లముందే ఉంటాయని చెబుతున్నారు. భరత్ తిప్పిరెడ్డి అనే ఐటీ నిపుణుడు ఈ సౌలభ్యాన్ని కలిగించారు.   


https://www.udemy.com/course/python-core-and-advanced/


https://www.udemy.com/course/javascriptfundamentals/


https://www.udemy.com/course/advanced-and-object-oriented-javascript/



Updated Date - 2020-04-08T22:09:09+05:30 IST