ఇంటర్‌ సిలబస్‌ తగ్గించే ఆలోచన లేదు: సబిత

ABN , First Publish Date - 2020-07-18T21:29:15+05:30 IST

ఇంటర్మీడియట్‌ సిలబస్‌ను తగ్గించే ఆలోచన లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శుక్రవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న

ఇంటర్‌ సిలబస్‌ తగ్గించే ఆలోచన లేదు: సబిత

ఆమనగల్లు, జూలై 17: ఇంటర్మీడియట్‌ సిలబస్‌ను తగ్గించే ఆలోచన లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శుక్రవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ విద్యార్థులకు 30ు ఆన్‌లైన్‌ తరగతులు, 70ు కళాశాలల్లో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర సెట్‌ల పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

Updated Date - 2020-07-18T21:29:15+05:30 IST