నేడే ఇంటర్ ఫలితాలు

ABN , First Publish Date - 2020-06-18T17:20:20+05:30 IST

ఇంటర్‌ ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌

నేడే ఇంటర్ ఫలితాలు

ఫస్టియర్‌, సెకండియర్‌ ఒకేసారి.. 

మధ్యాహ్నం 3 గంటలకు విడుదల 

3 వెబ్‌సైట్లలో ఫలితాలు


హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు పరీక్ష ఫలితాలను http://examresults.  ts.nic.in,    http://results.cgg.gov.in,  https://tsbie.cgg. gov.in   వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.  (www.andhrajyothy.com  లోనూ ఫలితాలను చూడవచ్చు) గత ఏడాది ఇంటర్‌ ఫలితాల విడుదల అనంతరం తలెత్తిన పరిణామాలతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి తప్పిదాలు లేకుండా విద్యా శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. సమాధాన పత్రాల ముల్యాంకనంలో ఏ పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టింది.


ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించామని సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. మార్చి 5 నుంచి 20 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగగా, చివరగా మార్చి 23న జరగాల్సిన జాగ్రఫి-2, మోడర్న్‌ లాంగ్వేజ్‌-2 పరీక్షలు లాక్‌డౌన్‌ కారణంగా వాయిదావేసి మే 18న నిర్వహించామన్నారు. గత ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 8,70,974 మంది విద్యార్థులు హాజరవ్వగా, ప్రథమ సంవత్సరంలో 60.5ు, ద్వితీయ సంవత్సరంలో 64.8ు ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి మొత్తం 9.65 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. 


Updated Date - 2020-06-18T17:20:20+05:30 IST