ఇన్నోవేషన్ చాలెంజ్‌కు 25వేల దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-11-27T15:33:18+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో 6-10 తరగతి పిల్లల కోసం ఏర్పాటుచేసిన స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను

ప్రభుత్వ పాఠశాలల్లో 6-10 తరగతి పిల్లల కోసం ఏర్పాటుచేసిన స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు పాఠశాల విద్యాశాఖ, యునిసెఫ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఇంక్విలాబ్ ఫౌండేషన్‌లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్లో చేపట్టాయి.
గత ఆగస్టు-28న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దీనిని ప్రారంభించగా.. మొత్తం 25వేలకు పైగా దరఖాస్తులు అందాయని గురువారం పాఠశాల విద్యాశాఖ తెలిపింది.