ఐఐటీ విద్యార్థి అంజలికి కేటీఆర్‌ అండ

ABN , First Publish Date - 2020-08-11T21:37:46+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన ఐఐటీ విద్యార్థి మేకల అంజలికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఐఐటీలో రెండో

ఐఐటీ విద్యార్థి అంజలికి కేటీఆర్‌ అండ

రెండో ఏడాది చదువు కోసం 1.50 లక్షలు అందజేత 

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన ఐఐటీ విద్యార్థి మేకల అంజలికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఐఐటీలో రెండో ఏడాదిలోకి ప్రవేశించిన అంజలికి ఫీజులు, ఇతర ఖర్చులు, లాప్‌టాప్‌ కొనుక్కునేందుకు రూ.1.50లక్షలను సోమవారం ఇక్కడ ప్రగతి భవన్‌లో ఆమెకు కేటీఆర్‌ అందించారు. గతేడాది హసన్‌పర్తిలోని గురుకులంలో ఇంటర్‌ పూర్తయిన అనంతరం అంజలి ఐఐటీలో ర్యాంకు సాధించింది. తన చదువు కోసం సహాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌ ద్వారా అంజలి కోరింది. దీంతో గతేడాది కూడా కేటీఆర్‌ ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఐఐటీ పూర్తయ్యే వరకూ అవసరమైన మొత్తాన్ని తానే అందజేస్తానని అంజలికి ఆ సమయంలో కేటీఆర్‌ హామీ ఇచ్చారు. రెండో ఏడాది చదువు కోసం సోమవారం ఆర్థికసాయం అందజేసిన కేటీఆర్‌కు అంజలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-08-11T21:37:46+05:30 IST