విద్య వ్యాపారమైపోయింది

ABN , First Publish Date - 2020-09-29T17:15:22+05:30 IST

డీఈడీ కళాశాలల్లో ‘స్పాట్‌ అడ్మిషన్ల’ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్పాట్‌ అడ్మిషన్‌’ అంటే డొనేషన్‌ తీసుకొని దొడ్డిదారిన ప్ర వేశం కల్పించడమేనని వ్యాఖ్యానించింది. ప్రవేశపరీక్ష(డీసెట్‌)లో

విద్య వ్యాపారమైపోయింది

‘స్పాట్‌ అడ్మిషన్‌’ అంటే  డొనేషన్‌తో దొడ్డిదారి ప్రవేశమే

కళాశాలలకు అసలు  అధికారం ఎవరిచ్చారు?

ప్రభుత్వ అనుమతి లేకుండా  ఎలా చేర్చుకున్నారు? 

డీఈడీ కళాశాలల వైఖరిపై  హైకోర్టు తీవ్ర ఆగ్రహం


అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): డీఈడీ కళాశాలల్లో ‘స్పాట్‌ అడ్మిషన్ల’ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్పాట్‌ అడ్మిషన్‌’ అంటే డొనేషన్‌ తీసుకొని దొడ్డిదారిన ప్ర వేశం కల్పించడమేనని వ్యాఖ్యానించింది. ప్రవేశపరీక్ష(డీసెట్‌)లో అర్హత సాధించని, అసలు పరీక్ష రా యని అభ్యర్థికి ఎలా అడ్మిషన్‌ కల్పిస్తారని నిలదీసింది. స్పాట్‌ అడ్మిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమ తి ఇవ్వకుండానే 2018-2020 విద్యా సంవత్సరానికి విద్యార్థుల్ని ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించింది. అసలు ఆ అధికారం ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రవేశాలకు గతంలో ప్రభుత్వం అనుమతించినంత మాత్రాన.. ఇప్పుడూ అలాగే అ నుమతి ఇప్పించాలని డీఈడీ కళాశాలలు న్యాయస్థానాన్ని కోరలేవని స్పష్టం చేసింది.


‘ఎక్కడైనా ప్ర భుత్వ నిర్ణయం పట్ల ఏదేని అభ్యంతరాలున్న పక్షంలో విద్యార్థులు కోర్టుకు వస్తారు. కానీ, ఇక్కడ కళాశాలల యాజమాన్యాలే కోర్టును ఆశ్రయించా యి!’ అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కళాశాలల యాజమాన్యాల వైఖరితో విద్యార్థులు నష్టపోతారని, వారు మనస్తాపం చెందుతున్నారని, అందుకు యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగిచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. మున్ముందు ప్రైవే టు వైద్య కళాశాలలు కూడా పరీక్ష రాయకుండానే అడ్మిషన్లు కల్పించడానికి పూనుకుంటాయని వ్యా ఖ్యానించింది. ప్రస్తుతం విద్యావిధానం లాభసాటి వ్యాపారంగా మారిపోయిందంటూ విచారం వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు అనువుగా విచారణను బుధవారానికి వాయిదా వేసింది.


ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. డీసెట్‌ ప్రవేశపరీక్ష రాయని అభ్యర్థుల్ని కూడా స్పాట్‌ అడ్మిషన్ల కింద చే ర్చుకున్నామని, ఇందుకు ప్ర భుత్వం ఆమోదించడం లే దని పేర్కొంటూ పలు డీ ఈడీ కళాశాలల యాజమాన్యాలు గతంలో హైకోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్ల ను విచారించిన సింగిల్‌ జ డ్జి తిరస్కరించారు. ఆతీ ర్పును సవాల్‌ చేస్తూ  కళాశాలల అప్పీలు చేశాయి. ఆ పిటిషన్ల విచారణ సోమవా రం ద్విసభ్య ధర్మాసనం ముందు జరిగింది.


ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. 18 వేల మంది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సు విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. కాలేజీలు అడ్మిషన్లు కల్పించాక ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. ఐసెట్‌, ఇంజనీరింగ్‌, మెడిక ల్‌ తదితర కోర్సులకు ప్రవేశపరీక్ష లేకపోయినా మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్‌ అడ్మిషన్లకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం డీఈడీ కళాశాలలకు మాత్రం అభ్యంతరం చెబుతోందన్నారు.


ఇప్పటికి జరిగిన అడ్మిషన్లకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వా న్ని ఆదేశించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విద్యా వ్యవస్థ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఆ మాఫియా నుంచి విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించాల్సి ఉందన్నారు. 
Updated Date - 2020-09-29T17:15:22+05:30 IST