పీజీ డిప్లమో సీట్లకు బదులు పీజీ సీట్లా?

ABN , First Publish Date - 2020-05-09T19:14:17+05:30 IST

సర్వీసులో ఉన్న వైద్యుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన పీజీ డిప్లమో సీట్లను రద్దు చేసి, వాటి స్థానంలో పీజీ సీట్లు తీసుకోవడానికి అనుమతించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. డిప్లమో సీట్ల స్థానంలో పీజీ సీట్లు తీసుకోవడానికి

పీజీ డిప్లమో సీట్లకు బదులు పీజీ సీట్లా?

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): సర్వీసులో ఉన్న వైద్యుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన పీజీ డిప్లమో సీట్లను రద్దు చేసి, వాటి స్థానంలో పీజీ సీట్లు తీసుకోవడానికి అనుమతించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. డిప్లమో సీట్ల స్థానంలో పీజీ సీట్లు తీసుకోవడానికి అనుమతిస్తూ ఎంసీఐ, రాష్ట్ర ప్రభుత్వం, హెల్త్‌ వర్సిటీల తీరు సహేతుకంగా లేదని స్పష్టం చేసింది. గ్రామాల్లో పనిచేసిన ఎంబీబీఎస్‌ డాక్టర్లకు వెయిటేజ్‌ మార్కుల ద్వారా కేటాయించే పీజీ డిప్లమో సీట్లను రద్దు చేసి రూ.కోట్లు లబ్ధి చేకూరే కొన్ని కాలేజీలకు అనుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. 2020-21 సంవత్సరానికి పాతవిధానమే కొనసాగించాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ కాలేజీలతో సహా ఆరు కాలేజీల్లో పీజీ డిప్లమో సీట్లు సరెండర్‌ చేసి వాటి స్థానంలో పీజీ సీట్లు తీసుకోవడానికి అనుమతిస్తూ ఎంసీఐ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ టి.అమరనాథ్‌గౌడ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఇన్‌ సర్వీసు డాక్టర్‌ పి. భావన వేసిన వ్యాజ్యంపై ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

Updated Date - 2020-05-09T19:14:17+05:30 IST