ఆగస్టు మొదటి వారంలో హెచ్‌సీయూ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-05-13T16:28:54+05:30 IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధన, పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనుంది. వర్సిటీ విద్యా కార్యకలాపాల క్యాలెండర్‌లో మార్పులు చేసి

ఆగస్టు మొదటి వారంలో హెచ్‌సీయూ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌ సిటీ, మే12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధన, పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనుంది. వర్సిటీ విద్యా కార్యకలాపాల క్యాలెండర్‌లో మార్పులు చేసి సరికొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు. ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు సెప్టెంబరు1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే  గడువు ఈ నెల 22తో ముగియనుంది.

Read more