గురుకుల విద్యార్థినికి ఆన్‌లైన్‌ వేధింపులు

ABN , First Publish Date - 2020-06-04T18:10:36+05:30 IST

కరోనాతో వచ్చిన ఖాళీ సమయాన్ని ప్రయోజనకరంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభింస్తే కొందరు ఉపాధ్యాయులు వీటిని కూడా లైంగిక వేధింపులకు ఆధారంగా

గురుకుల విద్యార్థినికి ఆన్‌లైన్‌ వేధింపులు

సందేహాలను నివృత్తి చేస్తానని అసభ్యకరమైన ఎస్‌ఎంఎస్లు, వీడియోలు

షాబాద్‌లో ఇద్దరు టీచర్ల నిర్వాకం

షాబాద్‌ : కరోనాతో వచ్చిన ఖాళీ సమయాన్ని  ప్రయోజనకరంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభింస్తే  కొందరు ఉపాధ్యాయులు వీటిని కూడా లైంగిక వేధింపులకు ఆధారంగా చేసుకుంటున్నారు. అసభ్యకరమైన ఎస్‌ఎంఎ్‌సలు, వీడియోలతో వేధింపులకు గురి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థిని సెలవుల్లో ఇంటి నుంచే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేది. ఈ క్రమంలో సదరు పాఠశాలలో భౌతికశాస్త్రం బోధించే పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌ ఫోన్‌లో సందేహాలను నివృత్తి చేస్తాననే సాకుతో అసభ్యకరమైన ఎస్‌ఎంఎ్‌సలు, వీడియో చాటింగ్‌లతో లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు.


ఈ విషయం ఆ విద్యార్థిని ఇంట్లో వారికి చెప్పలేదు. మంగళవారం అదే పాఠశాలలో పని చేసే మరో ఉపాధ్యాయుడు సురేందర్‌ సదరు విద్యార్థినితో ఆన్‌లైన్‌ తరగతుల విషయంపై మాట్లాడుతూ శ్రీకాంత్‌ సార్‌తో ఏమైనా మాట్లాడావా అని అడిగాడు. ఆ విద్యార్థిని ఏమీ లేదని చెప్పింది. దీంతో అతడు కూడా అసభ్యకరమైన మెసెజ్‌లతో చాటింగ్‌ చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు బుధవారం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌, తరవాత షాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-06-04T18:10:36+05:30 IST