508 మంది గ్రూప్‌4 అభ్యర్థులకు పోస్టింగులివ్వాలి

ABN , First Publish Date - 2020-12-15T17:45:12+05:30 IST

టీఎస్‌పీఎస్సీ 2017లో నిర్వహించిన గ్రూప్‌-4 పరీక్షల్లో ఎంపికైన వారికి మూడు నెలల్లోగా పోస్టింగులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు. ఎంపికైన 215 మంది జూనియర్‌ అసిస్టెంట్లు

508 మంది గ్రూప్‌4 అభ్యర్థులకు పోస్టింగులివ్వాలి

3 నెలల్లో ప్రక్రియ పూర్తవ్వాలి: కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశం

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ 2017లో నిర్వహించిన గ్రూప్‌-4 పరీక్షల్లో ఎంపికైన వారికి మూడు నెలల్లోగా పోస్టింగులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు. ఎంపికైన 215 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 281 మంది టైపిస్టులు, 12 మంది జూనియర్‌ స్టెనోలకు అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలని చెప్పారు.


సోమవారం 508 మంది అభ్యర్థుల జాబితాను జిల్లా కలెక్టరేట్ల అడ్మినిస్ట్రేట్‌ ఆఫీసర్లకు అందించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన కసరత్తు మంగళవారం నుంచి జిల్లాల్లో ప్రారంభంకానుంది.

Updated Date - 2020-12-15T17:45:12+05:30 IST