గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-15T15:25:31+05:30 IST
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్ష (క్వాలిఫైయింగ్)కు ఏపీ, తెలంగాణల్లో కలిపి 84.79% మంది హాజరయ్యారు. మెయిన్స్

తొలిరోజు పరీక్షకు 84.79% హాజరు: ఏపీపీఎస్సీ
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్ష (క్వాలిఫైయింగ్)కు ఏపీ, తెలంగాణల్లో కలిపి 84.79% మంది హాజరయ్యారు. మెయిన్స్ రాసేందుకు మొత్తం 9,679 మంది అభ్యర్థులకు అర్హత ఉండగా 8,348 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 7,079 మంది పరీక్ష రాశారు. పరీక్షలు ప్రశాతంగా జరిగినట్లు ఏపీపీఎస్సీ సెక్రెటరీ పి.ఎ్‌స.ఆర్.ఆంజనేయులు తెలిపారు. మెయిన్స్ పరీక్షలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి.