గ్రూప్-1 మెయిన్స్‌పై పునరాలోచన చేయాలి
ABN , First Publish Date - 2020-12-11T14:01:56+05:30 IST
ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఏపీపీఎస్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్
ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ ఊసేదీ?: పవన్
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఏపీపీఎస్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ నెలలో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణకు కమిషన్ సన్నద్ధమైందని, అదే సమయంలో ఇతర ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్య అర్హత పరీక్షలు ఉన్నందున పరీక్ష తేదీలు మార్చాలని ఉద్యోగార్థులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఏపీపీఎస్సీ ప్రణాళిక లేకుండా వ్యవహరించడం, పరీక్ష తేదీలను ప్రకటించేప్పుడు ఇతర నోటిఫికేషన్ తేదీలను పరిగణించకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతున్నారని, ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరారు.