టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు.. రెండేళ్ల సర్వీ్‌సతో బదిలీకి అర్హత

ABN , First Publish Date - 2020-10-13T14:04:02+05:30 IST

పాఠశాలల్లో పోస్టుల విభజన, టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను సోమవారం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యాహక్కు చట్టం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులను కేటాయిస్తున్నట్లు పేర్కొంది.

టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు.. రెండేళ్ల సర్వీ్‌సతో బదిలీకి అర్హత

టీచర్లకు 8.. హెడ్మాస్టర్లకు ఐదేళ్లు నిండితే తప్పనిసరి బదిలీ

వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహణ

స్టేషన్‌, సర్వీస్‌ పాయింట్ల వారీగా బదిలీలు

పోస్టుల విభజన, మార్గదర్శకాలు


అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో పోస్టుల విభజన, టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను సోమవారం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యాహక్కు చట్టం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపింది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి ప్రకారం సర్దుబాట్లు ఉంటాయని పేర్కొంది. ఈ నెల 1నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులకు బదిలీ కోరుకునే అర్హత కల్పించింది. బదిలీ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేయనున్నారు.


ఇవీ నిబంధనలు

బదిలీలకు కనీస సర్వీసు 2 సంవత్సరాలు. గరిష్ఠ సర్వీస్‌ ఉపాధ్యాయులకు 8(18.11.2012కి ముందు), ప్రధానోపాధ్యాయులకు 5 విద్యా సంవత్సరాలు. ప్రతిభ ఆధారిత పాయింట్ల రద్దు. స్టేషన్‌, సర్వీస్‌ పాయింట్ల ఆధారంగా బదిలీలు. కేటగిరీ 1,2,3,4 వారికి సంవత్సరానికి 1,2,3,4గా కేటాయింపు. సర్వీస్‌ పాయింట్లు సంవత్సరానికి 0.5. అవివాహిత, స్పౌజ్‌కు 5 పాయింట్లు. రేషనలైజేషన్‌కు 5 పాయింట్లు. అంగ వైకల్యం 70ు పైబడిన వారికి ప్రాధాన్యం. 2 సంవత్సరాలలోపు పదవీ విరమణ చేయబోయే వారికి బదిలీ నుంచి మినహాయింపు. కాగా, పోస్టుల విభజనకు కటాఫ్‌ తేదీ కమిషనర్‌ నిర్ణయిస్తారు. 60 మంది విద్యార్థుల వరకు 2 ఎస్‌జీటీ పోస్టులు, 61 నుంచి 90 మంది వరకు విద్యార్థులకు 3 పోస్టులు, 91 నుంచి 120 మంది వరకు 4 పోస్టులు, 151 మందికి పైన ఉంటే అదనంగా ఒక పీఎస్‌ హెడ్మాస్టర్‌ పోస్టు కేటాయించారు. 

Updated Date - 2020-10-13T14:04:02+05:30 IST