స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల తగ్గింపు
ABN , First Publish Date - 2020-10-31T15:51:03+05:30 IST
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు 30ు మేరకు తగ్గనున్నాయి. గత విద్యాసంవత్సరం(2019-20)లో ఉన్న ట్యూషన్ ఫీజులనే ఈ

30% తగ్గించాలంటూ సర్కారు ఉత్తర్వులు
ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు వర్తింపు
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు 30ు మేరకు తగ్గనున్నాయి. గత విద్యాసంవత్సరం(2019-20)లో ఉన్న ట్యూషన్ ఫీజులనే ఈ ఏడాది (2020-21) అమలు చేయడంతోపాటు దీనిలో 30ు మేరకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిస్థాయి ఫీజులు వసూలు చేసిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ చేసిన సిఫారసులపై వైద్య, ఆరోగ్య శాఖతో సంప్రదించి, పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యా మండలితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు.