ఇంజనీరింగ్‌, వైద్య సీట్ల భర్తీ ప్రక్రియపై బుక్‌లెట్‌

ABN , First Publish Date - 2020-09-21T16:35:20+05:30 IST

ఇంజనీరింగ్‌, వైద్య విద్యలో సీట్ల భర్తీ ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఓ బుక్‌లెట్‌ను

ఇంజనీరింగ్‌, వైద్య సీట్ల భర్తీ ప్రక్రియపై బుక్‌లెట్‌

ఇంజనీరింగ్‌, వైద్య విద్యలో సీట్ల భర్తీ ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశామని ఐజీటీ-జేఈఈ, నీట్‌ ఫోరం కన్వీనర్‌ కంచన లలిత్‌కుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా.. 2019లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, నిట్‌, ట్రిపుల్‌ ఐటీ, వైద్య విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ ప్రక్రియను విశ్లేషణాత్మకంగా ఈ బుక్‌లెట్‌లో పొందుపరిచామన్నారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌ విద్యార్థుల కోసం వేర్వేరుగా బుక్‌లెట్‌లు రూపొందించామని, వీటి మొబైల్‌ వెర్షన్‌ పీడీఎ్‌ఫకు 9849016661కు బుక్‌లెట్‌, నీట్‌ బుక్‌లెట్‌ అని టైప్‌ చేసి వాట్సాప్‌ చేయాలని కోరారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలు రాసిన, అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు.

Updated Date - 2020-09-21T16:35:20+05:30 IST