ఆన్‌లైన్ తరగతులను ప్రోత్సహించాలి: కేంద్ర మానవ వనరుల శాఖ సూచన
ABN , First Publish Date - 2020-07-08T17:16:02+05:30 IST
ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టతనిచ్చింది. కేంద్ర హోం శాఖ జూన్ 29న విడుదల చేసిన అన్‌లాక్ 2 మార్గదర్శకాల ప్రకారం

న్యూఢిల్లీ, జూలై 7: ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టతనిచ్చింది. కేంద్ర హోం శాఖ జూన్ 29న విడుదల చేసిన అన్‌లాక్ 2 మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సం స్థలను ఈ నెల 31 వరకు తెరవకూడదు. ఈ నేపథ్యంలో నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఆన్‌లైన్/డిస్టెన్స్ తరగతులను ప్రోత్సహించాలని మానవ వనరుల శాఖ పేర్కొంది. ఇందుకోసం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఇంటి నుం చే పని చేసేలా అవకాశం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మానవ వనరుల, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి అనితా కర్వాల్ అన్ని రాష్ట్రాల సీఎ్‌సలకు, విద్యా శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు.