అ.. ఆ.. లపై అశ్రద్ధ

ABN , First Publish Date - 2020-11-06T16:08:25+05:30 IST

9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలను సందర్శించవచ్చు. ఆన్‌లైన్‌ బోధనపై అనుమానాలను ఉపాధ్యాయులను కలిసి నివృత్తి చేసుకోవచ్చు.. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో

అ.. ఆ.. లపై అశ్రద్ధ

1, 2 తరగతులకు ప్రారంభం కాని అక్షరభ్యాసం 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎదురుచూపులు 

రాష్ట్రవ్యాప్తంగా 2లక్షలకు పైగా విద్యార్థులు 


హైదరాబాద్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలను సందర్శించవచ్చు. ఆన్‌లైన్‌ బోధనపై అనుమానాలను ఉపాధ్యాయులను కలిసి నివృత్తి చేసుకోవచ్చు.. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవే9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలను సందర్శించవచ్చు. ఆన్‌లైన్‌ బోధనపై అనుమానాలను ఉపాధ్యాయులను కలిసి నివృత్తి చేసుకోవచ్చు.. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన 3-8 తరగతుల విద్యార్థులు సైతం ఆన్‌లైన్‌ పాఠాలు విని సందేహాలుంటే టీచర్లకు ఫోన్‌ చేయవచ్చు.. మరి 1, 2 తరగతుల విద్యార్థుల సంగతేమిటి..? విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను అడుగుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం సంబంధిత ఉపాధ్యాయుల వద్దేకాదు.. విద్యాశాఖ ఉన్నతాఽధికారుల వద్ద కూడా లేదు. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై 2 నెలలు దాటినా ఇంతవరకు వీరికి సంబంధించి విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. వీరికి ఈ ఏడాది జీరో ఇయర్‌ ఉంటుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


విస్మరించిన విద్యా శాఖ.. 

కరోనా నేపథ్యంలో.. ప్రస్తుతం 3-10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. 1, 2 తరగతుల విద్యార్థుల వయసు 5, 6 సంవత్సరాలే ఉంటుంది కాబట్టి వారికి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడం సరికాదని మినహాయించారు. ప్రారంభంలో విద్యాశాఖ నిర్ణయం పట్ల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ, నవంబరు వచ్చినా ఇంతవరకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


8 వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈసారి 1, 2వ తరగతుల్లో ప్రవేశాలు పొందినవారి సంఖ్య 2లక్షలకు పైగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారులకు పాఠ్యపుస్తకాలు అందించి వారంలో ఒకటి రెండుసార్లు నేరుగా   ఇళ్లకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. ఏపీలోనూ డిసెంబరు-14 నుంచి 1-5 తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లోనే బోధించాలని నిర్ణయించారు. తెలంగాణలో మాత్రం ప్రత్యామ్నాయం ఆలోచించడం లేదు.  కరోనాతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావడంతో చాలామంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇలా ఈసారి 1, 2వ తరగతుల్లో ప్రవేశాల సంఖ్య కూడా పెరిగింది. 

Updated Date - 2020-11-06T16:08:25+05:30 IST