ఈసెట్‌లో 97.58శాతం ఉత్తీర్ణత
ABN , First Publish Date - 2020-09-12T18:40:22+05:30 IST
ఈసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 28,041 మంది దరఖాస్తు చేసుకోగా 25,448 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 24,832 (97.58ు)

16న నోటిఫికేషన్.. నెలాఖరులోపు ప్రవేశాలు పూర్తి
హైదరాబాద్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఈసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 28,041 మంది దరఖాస్తు చేసుకోగా 25,448 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 24,832 (97.58ు) మంది ఉత్తీర్ణత సాధించారని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
జేఎన్‌టీయూ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ర్టార్ డాక్టర్ మన్జూర్ హుసేన్‌తో కలిసి పాపిరెడ్డి ఫలితాలను విడుదలచేశారు. పరీక్షకు బాలురు 17803 హాజరు కాగా 63.49 శాతం ఉత్తీర్ణ సాధించారు. అదేవిధంగా బాలికల్లో 7026 మంది హాజరు కాగా 98.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈనెల 16న విడుదల చేస్తామని, 15 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని జేఎన్‌టీయూ రిజిస్ర్టార్, ఈసెట్ కన్వీనర్ డాక్టర్ మన్జూర్ హుసేన్ తెలిపారు.