ప్రశాంతంగా టీఎస్‌ ఈసెట్‌.. 25,448 మంది విద్యార్థుల హాజరు

ABN , First Publish Date - 2020-09-01T14:44:23+05:30 IST

కరోనా కారణంగా పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన టీఎస్‌ ఈసెట్‌ సోమవారం ప్రశాంతంగా జరిగింది. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో 52

ప్రశాంతంగా టీఎస్‌ ఈసెట్‌.. 25,448 మంది విద్యార్థుల హాజరు

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనా  కారణంగా పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన  టీఎస్‌ ఈసెట్‌ సోమవారం ప్రశాంతంగా జరిగింది. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో 52, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పరీక్ష కేంద్రాల్లో  ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన ఈసెట్‌కు 25,448మంది హాజరయ్యారు.  2568 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 90.48శాతం నమోదైనట్లు టీఎస్‌ ఈసెట్‌ కన్వీనర్‌, జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. రాష్ట్ర ఉన్నతా విద్యా మండలి ఛైర్మన్‌ టి.పాపిరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, సెక్రెటరీ ప్రొఫెసర్‌ శ్రీనివా్‌సరావు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. 


కొవిడ్‌-19 జాగ్రత్తలు

హైదరాబాద్‌లోని అన్ని పరీక్ష కేంద్రాల్లో కొవిడ్‌-19 జాగ్రత్తలను పాటించారు. కేంద్రాలను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చేవారికి మాస్క్‌ ఉంటేనే అనుమతించారు. ఉదయం సెషన్‌ ముగిసిన తర్వాత కంప్యూటర్లను, గదులను పూర్తిగా శానిటైజ్‌ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - 2020-09-01T14:44:23+05:30 IST