2 లక్షలు దాటిన ఎంసెట్ దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-05-13T16:19:39+05:30 IST
ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య 2 లక్షలు దాటింది. మంగళవారం నాటికి మొత్తం 2,00,896 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్‌కు 1,30,075, అగ్రికల్చర్

హైదరాబాద్, మే 12(ఆంధ్రజ్యోతి): ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య 2 లక్షలు దాటింది. మంగళవారం నాటికి మొత్తం 2,00,896 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్‌కు 1,30,075, అగ్రికల్చర్ విభాగానికి 70,821 దరఖాస్తులు వచ్చాయి. ఎంసెట్‌తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలకు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.