నేడు ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌.. సెప్టెంబరు 1 నుంచి తొలివిడత రిజిస్ర్టేషన్‌.?

ABN , First Publish Date - 2020-08-20T16:45:38+05:30 IST

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ)-2020 నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ,

నేడు ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌.. సెప్టెంబరు 1 నుంచి తొలివిడత రిజిస్ర్టేషన్‌.?

ఈసారి ‘ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ’ అమలు

‘సెట్‌’ల తేదీలు ఖరారు.. నేడు విద్యా మంత్రితో భేటీ

చాట్‌బోట్‌ ద్వారా వాట్సాప్‌లో అనుమానాల నివృత్తి 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి):  డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ)-2020 నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేయనున్నారు.   ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధుల్లోని వెయ్యికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సీట్లను దోస్త్‌ వెబ్‌సైట్‌ https://dost.cgg.gov.in ద్వారా భర్తీ చేస్తారు. తొలివిడత రిజస్ర్టేషన్‌ సెప్టెంబరు-1 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 


ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ, చాట్‌బోట్‌  

ఈసారి దోస్త్‌ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. విద్యార్థులు కంప్యూటర్‌ కీబోర్డ్‌, ల్యాప్‌టా్‌పను తాకకుండానే ఈ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. దీనికోసం ‘టీ యాప్‌ ఫోలియో’ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇంటర్‌ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టినతేదీ, ఆధార్‌, మొబైల్‌ నెంబర్లను యాప్‌లో నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం సెల్ఫీ ఫొటో దిగాలి. ఈ ఫొటోతో ఇంటర్‌ బోర్డు దగ్గర ఉన్న మీ పాత ఫొటోను సరిచూశాక దోస్త్‌ ఐడీ విడుదల అవుతుంది. అనుమానాలు తీర్చేందుకు ఈసారి ప్రత్యేకంగా చాట్‌బోట్‌ నెంబరును ప్రకటించారు. ఫోన్‌ 790 100 2200 నెంబరును కాంటాక్ట్‌ లిస్టులో సేవ్‌చేశాక.. వాట్సాప్‌ ద్వారా ఏజీ అని టైప్‌ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. 


దరఖాస్తు ఇలా..

ఆధార్‌తో  మొబైల్‌ నెంబర్‌ అనుసంధానమైఉన్న విద్యార్థులు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ పూర్తి చేసుకోవచ్చు. లేనివారు విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల మొబైల్‌ నెంబరును ఆధార్‌తో అనుసంధానించాలి. 

మీసేవ కేంద్రాలు లేదా జిల్లా కేంద్రాలు, యూనివర్సిటీల్లో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్లలో సంప్రదించవచ్చు.  ‘టి యాప్‌ ఫోలియో’ ద్వారా కూడా దోస్త్‌ వెబ్‌సైట్‌ రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. 

ఒకసారి రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లించాలి. తొలి విడతలో రిజిస్ర్టేషన్‌ చేసేవారు రూ. 200, రెండో విడతకు రూ. 400, మూడో విడత రిజిస్ర్టేషన్‌కు రూ. 600 చెల్లించాలి. 

రిజిస్ర్టేషన్‌ పూర్తరున విద్యార్థులకు దోస్త్‌ ఐడీ, పిన్‌ వస్తుంది. దీనిని  ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేవారకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తును జాగ్రత్తగా పూరించాలి. ఒకసారి పూరించాక మార్పులు చేర్పులు ఉండవు. 

వెబ్‌ ఆప్షన్లో కోర్సు, కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఇలా చేసినవారికే సీటు కేటాయింపు ఉంటుంది. 

కేటాయించిన కాలేజీ ఆమోదయోగ్యం అయితే ఆన్‌లైన్‌లో సీటు కన్ఫర్మేషన్‌ తెలిపి, మిగతా రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. 

సీటు కన్ఫర్మ్‌ అయిన విద్యార్థులు (ఏ విడతలోనైనా సరే) నిర్ణీత వ్యవధిలో సంబంధిత కళాశాలలో ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. 

కేటాయించిన సీటు ఆమోదయోగ్యం కాని విద్యార్థులు సీటు రిజర్వేషన్‌ రుసుము చెల్లించి.. మరోసారి రెండో, మూడో విడతలో వెబ్‌ ఆప్షన్‌ వినియోగించుకోవాలి. 

సీట్లను మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా భర్తీ చేస్తారు. 

రిజర్వేషన్లో సీటు పొందాలనుకునే విద్యార్థులు ప్రభుత్వం జారీచేసిన కుల ధృవీకరణ పత్రం మీసేవ నెంబరు (సీఎన్‌డీ నెంబర్‌/సబ్‌ క్యాస్ట్‌) తప్పనిసరిగా నమోదుచేయాలి. 

ఏప్రిల్‌-1, 2019 తర్వాత జారీచేసిన ఇన్‌కం సర్టిఫికెట్‌ దోస్త్‌-2020 ప్రవేశాల్లో అనుమతిస్తారు. ఇతర కోటా కోసం ఎన్‌సీసీ, వికలాంగుల ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. 


బీసీ గురుకుల ప్రవేశానికి గడువు పెంపు

మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే బీసీ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని జూనియర్‌ కాలేజీలు, మహిళా డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు గడువును  సెప్టెంబర్‌ 6 వరకు సంస్థ పొడిగించింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2020-08-20T16:45:38+05:30 IST