‘దోస్త్‌’ మొదటి జాబితా 21న విడుదల

ABN , First Publish Date - 2020-09-16T17:52:38+05:30 IST

డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు 2 రోజులు పొడిగించడంతో సీట్ల కేటాయింపు మొదటి జాబితా ఈనెల

‘దోస్త్‌’ మొదటి జాబితా 21న విడుదల

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు 2 రోజులు పొడిగించడంతో  సీట్ల కేటాయింపు మొదటి జాబితా ఈనెల 21న ప్రకటిస్తామని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మంగళవారం తెలిపారు. రెండోవిడత రిజిస్ర్టేషన్స్‌, వెబ్‌ ఆప్షన్స్‌ ఈనెల 17కు బదులు 21 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. తొలివిడత రిజిస్ర్టేషన్‌ ఈనెల 7తో ముగియాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రెండురోజులు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 16న సీట్ల కేటాయింపు జాబితాను ప్రకటించాలి. 

Updated Date - 2020-09-16T17:52:38+05:30 IST