పీజీలో సర్వీసు కోటా ఏదీ: ప్రభుత్వ వైద్యుల సంఘం

ABN , First Publish Date - 2020-09-18T15:57:00+05:30 IST

రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సీట్ల భర్తీలో సర్వీసు కోటా వైద్యులకు రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వ వైద్యులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు

పీజీలో సర్వీసు కోటా ఏదీ: ప్రభుత్వ వైద్యుల సంఘం

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సీట్ల భర్తీలో సర్వీసు కోటా వైద్యులకు రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వ వైద్యులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం విజయవాడలో డీఎంఈ వెంకటేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సర్వీస్‌ కోటా వైద్యులకు రిజర్వేషన్‌ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్‌ డాక్టర్‌ జయధీర్‌ బృందం గురువారం డీఎంఈని కలిసింది. దీనిపై డీఎంఈ స్పందిస్తూ.. రిజర్వేషన్‌ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

Updated Date - 2020-09-18T15:57:00+05:30 IST