డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ పరీక్షల్లేవ్‌!

ABN , First Publish Date - 2020-06-19T16:00:22+05:30 IST

రాష్ట్రంలో ఇక డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ పరీక్షలు కూడా లేనట్టే! అంతకుముందు సెమిస్టర్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనలియర్‌ మార్కులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి

డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ పరీక్షల్లేవ్‌!

ఉన్నతస్థాయి సమీక్షలో ఏకాభిప్రాయం  

ముఖ్యమంత్రితో చర్చించాక తుది నిర్ణయం

గత సెమిస్టర్లు, ఇంటర్నల్స్‌ ఆధారంగా మార్కులు 


హైదరాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇక డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ పరీక్షలు కూడా లేనట్టే!   అంతకుముందు సెమిస్టర్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనలియర్‌ మార్కులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. దీనిపై గురువారం మంత్రి సబిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో అత్యధికులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.


డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌లో ఫైనలియర్‌ మినహా ఇతర తరగతుల పరీక్షలు ఇప్పటికే రద్దుచేసి పై తరగతికి ప్రమోట్‌ చేశారు. కీలకమైన ఫైనలియర్‌ విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒడిసా, మహారాష్ట్రలో మాదిరి పరీక్షలు రద్దు చేసి, గత సెమిస్టర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.  దీనిపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ’


Updated Date - 2020-06-19T16:00:22+05:30 IST