అక్టోబరు 5 నుంచి అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-17T18:02:13+05:30 IST

డిగ్రీ పరీక్షల తేదీలను అంబేడ్కర్‌ ఓపెన్‌ యునివర్సిటీ బుధవారం ప్రకటించింది. డిగ్రీ(సీబీసీఎస్‌) ఆరో సెమిస్టర్‌

అక్టోబరు 5 నుంచి అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): డిగ్రీ పరీక్షల తేదీలను అంబేడ్కర్‌ ఓపెన్‌ యునివర్సిటీ బుధవారం ప్రకటించింది. డిగ్రీ(సీబీసీఎస్‌) ఆరో సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు 5-10 తేదీల్లో, ఐదో సెమిస్టర్‌ అక్టోబరు 11-16, మొదటి సెమిస్టర్‌ నవంబరు నవంబరు 7-13 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. డిగ్రీ(ఓల్డ్‌ బ్యాచ్‌) పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. మూడో సంవత్సరం పరీక్షలను అక్టోబరు 18-23, రెండో సంవత్సరం అక్టోబరు 27 నుంచి నవంబరు 2, మొదటి సంవత్సరం నవంబరు 4-7 తేదీల్లో ఉంటాయని పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-17T18:02:13+05:30 IST