ప్రధానోపాధ్యాయుడి మూడో పెళ్లి..

ABN , First Publish Date - 2020-03-15T18:25:03+05:30 IST

అతను నాలుగు పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు. ఇప్పటికే ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. పిల్లలూ ఉన్నారు. తన వద్ద చదివే విద్యార్థులను సరైన బాటలో

ప్రధానోపాధ్యాయుడి మూడో పెళ్లి..

18 ఏళ్ల టీచర్‌కు మాయమాటలు చెప్పి మూడో పెళ్లి..

హైదరాబాద్/బంజారాహిల్స్‌: అతను నాలుగు పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు. ఇప్పటికే ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. పిల్లలూ ఉన్నారు. తన వద్ద చదివే విద్యార్థులను సరైన బాటలో నడిపించే గురుతర బాధ్యత అతడిపై ఉంది. కానీ, అతడి బుద్ధి దారి తప్పింది. తన వద్ద పని చేస్తున్న 18 ఏళ్ల టీచర్‌కు మాయమాటలు చెప్పి మూడో వివాహం చేసుకున్నాడు.


హెచ్‌ఎం మోసం గురించి తెలుసుకున్న యువతి బంధువులు స్కూల్‌పై దాడి చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి స్కూల్‌ పేరిట నాలుగు శాఖలను నిర్వహిస్తున్నాడు. ఇద్దరు మహిళలతో వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అదే స్కూల్‌ బ్రాంచిలో ఓ యువతి కొద్ది రోజుల నుంచి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఆమెపై కన్నేసిన అయూబ్‌ మాయమాటలు చెప్పడం మొదలు పెట్టాడు. తనకు వివాహం కాలేదని నమ్మించి వారం రోజుల క్రితం ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అయూబ్‌కు ఇదివరకే వివాహం జరిగినట్టు బంధువులకు తెలిసింది. దీంతో వారు స్కూల్‌ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు అయూబ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-15T18:25:03+05:30 IST